నాటక మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:18 AM
గుంటూరులో వచ్చే నెల జరగనున్న భారత రంగ్ అంతర్జాతీయ నాటక మహాత్సవాన్ని విజ యవంతం చేయాలని, ప్రతి కళాపరిషత్ నుంచి సభ్యులు నాటకపోటీలను తిలకించ డానికి రావాలని వేదిక అధ్యక్షులు డా ముత్తవరపు సురేష్‌బాబు పిలుపునిచ్చారు.
మార్టూరు, జనవరి7 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో వచ్చే నెల జరగనున్న భారత రంగ్ అంతర్జాతీయ నాటక మహాత్సవాన్ని విజ యవంతం చేయాలని, ప్రతి కళాపరిషత్ నుంచి సభ్యులు నాటకపోటీలను తిలకించ డానికి రావాలని వేదిక అధ్యక్షులు డా ముత్తవరపు సురేష్‌బాబు పిలుపునిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషలో ప్రదర్శనలు చేసే 17 నాటిక కళా పరిషత్తులు అందరూ కలిసి ‘వేదిక’ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఫిబ్రవరి 6, 7, 8, 9, 10 తేదీలలో గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఐదు నాటకాలను ప్రదర్శించి భారతరంగ్ అంతర్జాతీయనాటక మహాత్సవం నిర్వ హిస్తున్నారు. అందుకు సంబం దించి నాటక పోటీలను విజయవంతం చేయడానికి అధ్యక్షుడు ఎం.సురేష్‌బాబు, కార్యదర్శి జాష్టి వెంకట మోహనరావు లు 17 కళాపరిషత్ లకు చెందిన వారితో స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో బుధవారం సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడుతూ గుంటూరులో ప్రదర్శించనున్న నాటకాలలో ఇతర దేశాలు పోలెండ్, చెకొస్లావేకియాలకు చెందిన కళాకా రులు రెండు నాటకాలను ప్రదర్శిస్తారన్నారు. ఆర్ధికంగా కష్టమైనప్పటికీ, తెలుగుభాషలో ప్రదర్శించే కళాపరిషత్‌లలో కొత్తదనం తీసుకురావాలని, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా గ్రామాలలో కళలపై, కళారూపాలపై ఆసక్తి ఉన్న వారిని గుంటూరులో నాటక ప్రదర్శనలను తిలకించడానికి తీసుకురావాల న్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జాష్టి వెంకటమోహనరావు, శ్రీకారం అధ్యక్షులు కందిమళ్ల సాంబశివరావు, వివిధ కళాపరిషత్‌ల అధ్యక్షులు కె రామాంజనే యులు, గుదే తారకరామారావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు మాదాల సాంబశివరావు, రావి అంకమ్మచౌదరి, చెన్నుపాటి బసవరాములు, ఎం.ఈశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.