Share News

సంక్రాంతి సందడి ప్రారంభం

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:28 AM

పట్టణ పరిధిలోని ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో మున్సిపల్‌ చైర్మన్‌ మించాల సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహిం చిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే కొండయ్య సంప్ర దాయ దుస్తుల్లో హాజరయ్యారు.

సంక్రాంతి సందడి ప్రారంభం

చీరాల, జనవరి12 (ఆంధ్రజ్యోతి) : తెలుగు ప్రజల సంప్రదాయాల పండుగ సంక్రాంతి అని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో మున్సిపల్‌ చైర్మన్‌ మించాల సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహిం చిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే కొండయ్య సంప్ర దాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఈక్రమంలో మహిళ లు ముగ్గులు, హరిదాసు కీర్తనలు, భోగి మంటల సందడి, గాలి పటాలతో నిర్వహించిన వేడుకలను చూసి ఆనందించారు. అలాగే పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఎద్దుల బండిఎక్కి హుషా రు పరిచారు. అలాగే ఇటీవల ఆల్‌ ఇండియా మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ ఛాంపియన్‌సిప్‌ -2026 పోటీల్లో రాణించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్య క్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ దానియేల్‌ జోసఫ్‌, డిఈ రఘురాం, వైస్‌చైర్మన్‌ సుబ్బయ్య, పట్టణ అధ్యక్షు లు సురేష్‌, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

అరుదైన సంప్రదాయం

ఇంకొల్లు : ధనుర్మాస ప్రారంభం నుంచి సంక్రాంతి వరకు ప్రతిరోజు ఊరిలో కనిపించే హరిదాసులు అరుదయ్యారు. ప్రస్తుతం పంగులూరు మండలం కొండమూరు గ్రామానికి చెందిన శంరయ్య వారం రోజులుగా ఇంకొల్లు మండలంలో రోజుకో ఊరు తిరుగుతున్నారు. ఈ సందర్భం గా ఆయన్ను ‘ఆంధ్రజ్యోతి’ పలక రించగా, సంప్రదాయాలు కనుమరుగవుతాయనే ఉద్ధేశ్యం తో కనీసం కొంతమందికైనా గుర్తుచేయాలనే ఇలా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తమ ప్రాముఖ్యత కేవలం ప్రచారాలకే పరిమిత మైందన్నారు. నియోజవర్గంలో అక్కడక్కడ ఉన్న హరిదాసుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

14న గొనసపూడిలో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు

చినగంజాం : మండలంలోని గొనసపూడి గ్రామంలో ఈ నెల 14వ తేది ఉదయం 9గంటలకు రాష్ట్రస్థాయి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సంక్రాంతి సంబరాల కమిటీ సభ్యులు తెలిపారు. ముగ్గుల పోటీలలో విజేతలైన మహిళలకు మొదటి బహుమతి రూ.55,555లు, రెండవ స్థానంలో నిలిచిన ఇద్దరికి రెండవ బహుమతి రూ. 25,555లు, మూడవ స్థానంలో నిలిచిన ముగ్గురికి మూడవ బహుమతి రూ. 10,555ల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. ముగ్గు వేసే బాక్స్‌ సైజ్‌ 7.7సైజ్‌, మగ్గు వేసే మహిళలకు సహాయకులుగా ఒక్కరికి మాత్రమే అనుమతిస్తార న్నారు. పోటీదారులందరికీ కన్సోలేషన్‌ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ముగ్గల పోటీల్లో పాల్గొనదలిచిన వారు 9849083710, 8555028775 సెల్‌ నెంబర్లను సంప్రదించాలని సంక్రాంతి సంబరాల కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - Jan 13 , 2026 | 12:28 AM