Share News

సీసీరోడ్లతో ఇసుకదర్శి దశ తిరిగింది!

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:09 PM

వాన కురిస్తే పల్లెటూళ్లలోని అంతర్గత రోడ్లపై ప్రశాంతంగా నడిచి తిరగాలంటే బురద భయపెడుతుంటుంది. రొచ్చులో నడవలేక ప్రజలు అల్లాడిపోతుంటారు.

సీసీరోడ్లతో ఇసుకదర్శి దశ తిరిగింది!
ఇసుకదర్శిలో నిర్మాణం పూర్తి చేసుకున్న సిమెంటు రోడ్డు

ప్రజా ప్రభుత్వంలో 10 సీసీ రోడ్ల నిర్మాణం

కోటి రూపాయలకు పైగా వ్యయం

మార్టూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి) : వాన కురిస్తే పల్లెటూళ్లలోని అంతర్గత రోడ్లపై ప్రశాంతంగా నడిచి తిరగాలంటే బురద భయపెడుతుంటుంది. రొచ్చులో నడవలేక ప్రజలు అల్లాడిపోతుంటారు. అలాంటి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం సీసీ రోడ్లను నిర్మిస్తోంది. మండల పరిధిలో గల ఇసుకదర్శి గ్రామంలో ఏకంగా కోటి రూపాయలకు పైగా వ్యయంతో సిమెంటు రోడ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. రెండు నెలల వ్యవధిలోనే రూ.65 లక్షల వ్యయంతో ఆరు సిమెంటు రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. వాటిల్లో బీసీ కాలనీలో రెండు, ముస్లిం ఏరియాలో మూడు, ఆర్యవైశ్యులు ఏరియాలో ఒక సిమెంటు రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేశారు. అదేవిధంగా గత ఏడాది క్రితం రూ.35 లక్షలతో నాలుగు సిమెంటు రోడ్లు నిర్మించారు. ప్రజాప్రభుత్వంలో గ్రామంలో ఇప్పటివరకు 1500 మీటర్ల వరకు సిమెంటు రోడ్లు నిర్మాణాలు జరిగాయి. టీడీపీ నాయకులు కామేపల్లి హరిబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు రోడ్లు నిర్మాణాలను పూర్తిచేశారు. దాంతో కోనంకి, వలపర్ల రోడ్డు ప్రస్తుతం తారురోడ్డుగా నిర్మాణ పనులు జరుగుతుండటంతో, వలపర్ల నుండి మార్టూరుకు వచ్చేవారు మార్టూరు, జొన్నతాళి గ్రామాల నుంచి వలపర్ల గ్రామానికి వెళ్లే వారు జాతీయరహదారి నుంచి ఇసుకదర్శి గ్రామంలోని సిమెంటు రోడ్లు మీదుగా వలపర్ల గ్రామానికి వెళుతున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:09 PM