Share News

షైనింగ్‌ స్టార్లలో ‘ప్రైవేటు’ హవా

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:46 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కు లు తెచ్చుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న షైనింగ్‌ స్టార్‌ అవార్డుల సాధనలో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం అవార్డుల్లో మూడింట రెండొంతుల మంది వారే ఎంపికయ్యారు.

షైనింగ్‌ స్టార్లలో ‘ప్రైవేటు’ హవా

మూడింట రెండొంతులు వారే

అత్యధికంగా 131మంది ఎంపిక

ఒంగోలు విద్య, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కు లు తెచ్చుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న షైనింగ్‌ స్టార్‌ అవార్డుల సాధనలో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం అవార్డుల్లో మూడింట రెండొంతుల మంది వారే ఎంపికయ్యారు. జిల్లాలో 191 మంది ఈ అవార్డులకు ఎంపిక కాగా వీరిలో 131మంది ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులు కావడం గమనార్హం. ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్‌, ఏపీ మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకులాల్లో కలిపి కేవలం 60మంది మాత్రమే ఉన్నారు. జడ్పీ హైస్కూళ్ల నుంచి 46 మంది, ఏపీ మోడల్‌ స్కూళ్ల నుంచి నలుగురు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి ముగ్గురు, ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఎయిడెడ్‌, బీసీ సంక్షేమ గురుకులాలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాలు, ప్రభుత్వ బాలికల పాఠశాలలు, కేజీవీవీల నుంచి ఒక్కొక్కరు ఎంపిక కాగా మునిసిపల్‌ పాఠశాలల నుంచి ఒక్కరికి కూడా అవార్డు దక్కలేదు. షైనింగ్‌ స్టార్‌ అవార్డుల సాధన లో ఒంగోలు అర్బన్‌, కొండపి మండలాలు జిల్లాలో అగ్రస్థానంలో నిలిచాయి. ఒంగోలు అర్బన్‌, కొండపి మండలాల నుంచి 10మంది చొప్పున ఎంపికయ్యారు. కొరిశపాడు మండలం నుంచి తొమ్మిది మంది, అద్దంకి, దర్శి మండలాల నుంచి ఎనిమిది మంది చొప్పున, కందుకూరు, మర్రిపూడి, ఎన్‌జీపాడు, సంతమాగులూరు, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి మండలాల నుంచి ఏడుగురు చొప్పున మిగిలిన 16 మండలాల నుంచి ఆరుగురు చొప్పున విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

Updated Date - Jul 19 , 2026 | 02:46 AM