Share News

పల్లె పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:32 PM

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్‌ పాల్గొనే పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పిలుపునిచ్చారు.

పల్లె పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గొట్టిపాటి

$పల్లె పండుగ సన్నాహాక సమావేశంలో మంత్రి గొట్టిపాటి

పామూరు,సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్‌ పాల్గొనే పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పిలుపునిచ్చారు. స్థానిక పువ్వాడి కల్యాణ మండపంలో పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాక సమావేశం ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ప్రజాప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి శరవేగంగా సాగుతోందన్నారు. పల్లె పండుగ కార్యక్రమాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల సభకు అటు నెల్లూరు జిల్లా, ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 20 వేల మంది ప్రజలు పాల్గొనేలా జన సమీకరణ చేయాలని సూచించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ మాట్లాడుతూ ఉగ్ర సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని, మెట్ట ప్రాంత అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌ -2 పనులు ప్రారంభించే విధంగా సీఎం చర్యలు తీసుకొనేలా అందరం కోరాలని సూచించారు. ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ పల్లె పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్ట్‌తో పాటు వచ్చే ఏడాది జనవరి నాటికి నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ ట్రయిల్‌ రన్‌ జరుగుతుందని, ఇంటింటికీ కుళాయి ద్వారా నీటి సరఫరా, అంతర్జాతీయ స్థాయిలో ట్రిబుల్‌ఐటి నిర్మాణానికి భూమిపూజ, పనులు జరగనున్నాయన్నారు. వెలిగొండ నీటిని డొక్కలవాగు ద్వారా మోపాడు రిజర్వాయర్‌కు అనుసంధానం చేసుకొనేందుకు ఈ ప్రాంతం నుంచి 20 వేల మందికి తగ్గకుండా కూటమి శ్రేణులు జన సమీకరణ చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, మద్దిపడు వెంకట్రాజు, ఏలూరి సాంబశివరావు, బీదా రవిచంద్ర, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబుతోపాటు నాగేశ్వరరావు నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, యారవ శ్రీనివాస్‌, చుంచు కొండయ్య, ఉప్పలపాటి హరిబాబు, పాలపర్తి వెంకటేశ్వర్లు, రాయవరపు మాల్యాద్రిచౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, అమీర్‌బాబు, ఇర్రి కోటిరెడ్డి, ఎన్‌ నాగేంద్రాచారి పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 11:32 PM