బంగ్లా ఖాళీచేయని అధికారి
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:29 AM
బదిలీ అయి వెళ్లిన సబ్ కలెక్టర్ బంగ్లాను నాలుగు నెలలుగా ఖాళీ చేయలేదని తెలుసుకున్న కలెక్టర్ రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెండ్రోజుల క్రితం ఆయన సబ్ కలెక్టర్ బంగ్లాపై ఆరా తీశారు.
ఆగ్రహించిన కలెక్టర్ రాజాబాబు?
మార్కాపురం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : బదిలీ అయి వెళ్లిన సబ్ కలెక్టర్ బంగ్లాను నాలుగు నెలలుగా ఖాళీ చేయలేదని తెలుసుకున్న కలెక్టర్ రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెండ్రోజుల క్రితం ఆయన సబ్ కలెక్టర్ బంగ్లాపై ఆరా తీశారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన సబ్‌కలెక్టర్ ఇంకా ఖాళీ చేయలేదని అధికారులు చెప్పారు. దీంతో వెంటనే ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అందులో గత సబ్ కలెక్టర్ సామగ్రి ఉండడంతో కొంత గడువు ఇచ్చి తరువాత అవసరమైతే అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.