Share News

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Sep 02 , 2026 | 02:44 AM

జిల్లాలో ఈనెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు, చిట్‌ఫండ్‌ సంస్థల ప్రతినిధులు సహక రించాలని అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధి కార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి సీహెచ్‌వీ రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా న్యాయస్థానంలోని బార్‌ అసోసియేషన్‌ హాలులో మంగళవారం న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి
న్యాయవాదులతో సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రామకృష్ణ

అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రామకృష్ణ

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈనెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు, చిట్‌ఫండ్‌ సంస్థల ప్రతినిధులు సహక రించాలని అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధి కార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి సీహెచ్‌వీ రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా న్యాయస్థానంలోని బార్‌ అసోసియేషన్‌ హాలులో మంగళవారం న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం న్యాయమూర్తి కార్యాలయంలో చిట్‌ఫండ్‌ సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులతో సమావేశమై చర్చించారు. అదాలత్‌ ద్వారా వివాదాలను సులభతరంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్ర మంలో సీనియర్‌ న్యాయవాది పంగులూరు గోవిందయ్య, బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు చావలి రమేష్‌బాబు, ఉపాధ్యక్షుడు రవికుమార్‌, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 02:44 AM