Share News

కేజీబీవీల్లో కొలువులు హుష్‌

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:06 AM

ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) కొలువులు హుష్‌కాకి అయ్యాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గత ఏడాది డిసెంబరులో జారీచేసిన నోటిఫికేషన్‌ రద్దుచేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్పీడీ) ఉత్తర్వులు జారీచేశారు.

కేజీబీవీల్లో కొలువులు హుష్‌

ఉద్యోగ నోటిఫికేషన్‌ను రద్దుచేసిన సమగ్ర శిక్ష ఎస్పీడీ

104 పోస్టులకు 5,018 మంది దరఖాస్తు

అభ్యర్థుల ఆశలు ఆవిరి

ఒంగోలు విద్య, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) కొలువులు హుష్‌కాకి అయ్యాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గత ఏడాది డిసెంబరులో జారీచేసిన నోటిఫికేషన్‌ రద్దుచేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్పీడీ) ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగాల కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్న అర్హులైన మహిళా అభ్యర్థులకు తీవ్ర నిరాశే మిగిలింది. జిల్లాలో 104 పోస్టులకు దరఖాస్తు చేసిన 5,018 మంది అభ్యర్థుల ఆశలు ఆవిర య్యాయి. కేజీబీవీల్లో 1,095 పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. 13 రకాల నాన్‌టీచింగ్‌ పోస్టులను నోటిఫికేష న్‌లో ఉంచారు. జిల్లాకు సంబంధించి 104 పోస్టులు ప్రకటించారు. అలా అన్నిరకాల పోస్టులకు 5,018 మంది అభ్యర్థులు దర ఖాస్తు చేసుకున్నారు. వారిలో మహిళా అభ్య ర్థులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పోస్టులకు గత డిసెంబరు, జనవరిలోనే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఉద్యోగం దక్కుతుందని ఆశతో జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది మహిళా అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఒంగోలు వచ్చి ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించారు. ప్రక్రియ ముగిసి ముగియగానే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ నిలిపివేస్తున్నట్లు ఎస్పీడీ ప్రకటించారు. భర్తీ ప్రక్రియ పునఃప్రారంభమవుతుందని ఇన్నాళ్లు అభ్యర్థులు ఆందోళనగా చూశారు. అయితే గతంలో కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌ ను రద్దుచేస్తూ ఎస్పీడీ ఉత్తర్వులు జారీచేసి మహిళా అభ్యర్థులకు షాక్‌ ఇచ్చారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్న అభ్యర్థులకు నిరాశే మిగిలింది.

Updated Date - Sep 20 , 2026 | 03:06 AM