Share News

రైతుల ఆర్థిక పురోగతే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:27 PM

రైతుల ఆర్థిక పురోగతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. మండలంలోని చాకిరాల గ్రామంలో శ్రీరామలింగేశ్వరస్వామి సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కందుల, శనగల కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

రైతుల ఆర్థిక పురోగతే ప్రభుత్వ లక్ష్యం
కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : రైతుల ఆర్థిక పురోగతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. మండలంలోని చాకిరాల గ్రామంలో శ్రీరామలింగేశ్వరస్వామి సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కందుల, శనగల కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన పంటను రవాణా ఖర్చు భారం లేకుండా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రాల్లో రైతులు వద్ద ఉన్న కందులు, శనగలు, ఇతర ధాన్యాలను అమ్ముకునే వెసులుబాటు కల్పించిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం గిట్టుబాటు ధరను నిర్ణయించి రైతులకు మేలు చేకూరుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ జైనులాబ్దిన్‌, మండల టీడీపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ ప్రకాశం, రైతుసంఘం నాయకులు పిల్లి తిప్పారెడ్డి, చాకిరాల గ్రామస్థులు పాల్గొన్నారు.

దళారులకు చెక్‌ పెట్టేందుకు కొనుగోలు కేంద్రాలు

పామూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : దళారులను చెక్‌ పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని టీడీపీ నాయకులు యారవశ్రీను చెప్పారు. మండలంలోని వగ్గంపల్లి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొంటే మద్దతు ధర నగదును రెండు రోజుల్లో రైతు బ్యాంకు కాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, సింగిల్‌ విండో చైర్మన్‌ ఉప్పలపాటి హరిబాబు, డైరెక్టర్‌ వై రహీముల్లా, సర్పంచ్‌లు కొండబాబు, సుబ్బయ్య, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రెక్కల రమణారెడ్డి, సింగిల్‌విండో కార్యాలయ సీఈవో శేషిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:27 PM