Share News

ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:00 PM

ప్రజలు వందశాతం తృప్తి చెందేలా అధికారులు పని చేసి ప్రజాప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదేశించారు.

ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలి
సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి స్వామి

మంత్రి స్వామి

తూర్పునాయుడుపాలెం (కొండపి), జనవరి8 (ఆంధ్రజ్యోతి): ప్రజలు వందశాతం తృప్తి చెందేలా అధికారులు పని చేసి ప్రజాప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదేశించారు. బుధవారం రాత్రి తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి కళావతి, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ లక్ష్మానాయక్‌, నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీవోలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులు, డీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడు డ్రైన్లు, నిర్మాణంతోపాటు వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

Updated Date - Jan 08 , 2026 | 11:00 PM