గ్రామీణుల జీవనోపాధి బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:44 AM
గ్రామీణ ప్రజల జీవనోపాఽ ధిని బలోపేతం చేయడమే వీబీ - జీరామ్‌జీ పథకం లక్ష్యమని ఎంవోఆర్డీ డైరెక్టర్ రాజేశ్వరి తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా శాశ్వత పనులు చేస్తామని చెప్పారు.
వీబీ-జీరామ్‌జీ అమలును పరిశీలించిన కేంద్ర బృందం
కనుమళ్లలో ఉపాధి కూలీలతో ముఖాముఖి
సింగరాయకొండ, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రజల జీవనోపాఽ ధిని బలోపేతం చేయడమే వీబీ - జీరామ్‌జీ పథకం లక్ష్యమని ఎంవోఆర్డీ డైరెక్టర్ రాజేశ్వరి తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా శాశ్వత పనులు చేస్తామని చెప్పారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీ వికా మిషన్ గ్రామీణ చట్టం-2025 (వీబీ- జీరామ్‌జీ) పథకం అమలును పర్యవేక్షించడానికి కేంద్రప్రభుత్వం నియమించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ డైరెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం మంగళవారం మండలంలోని కనుమళ్లలో పర్యటించింది. అక్కడ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంది. తొలుత పథకం కింద జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఈకేవైసీ వివరాలను బృందం పరిశీలించింది. రోజ్‌గార్ గ్యారెంటీ కార్డుల పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకుంది. కూలీలతో ముఖాముఖి మాట్లాడి వీబీ జీరామ్‌జీ పథకంపై వారి అభిప్రాయాలను సేకరించింది. అనంతరం ఎంవోఆర్డీ డైరెక్టర్ రాజేశ్వరి మాట్లాడారు. పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల వేతన దినాలు కల్పించడం, పనిచేసిన 15 రోజుల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమచేస్తారని తెలిపారు. గ్రామాల్లో పేదరికాన్ని నిర్మూలించి వికసిత భారత్ లక్ష్య సాధనకు తోడ్పాటు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యురాలు ఈషా, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, ఏపీడీ రవికుమార్, ఏపీవో సుభాషిణి, ఏపీఎం భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.