Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jan 21 , 2026 | 10:54 PM

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
పుస్తకాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. బుధవారం ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై ఆయన అర్జీలు స్వీకరించి పరిశీలించారు. గ్రామాల్లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీస మరమ్మతులకు కూడా నోచుకోక అధ్వానంగా ఉన్న రోడ్లకు నేడు రూపురేఖలు మారుతున్నాయన్నారు. ప్రత్యేక ప్రణాళికలతో ఆర్‌అండ్‌బీ రోడ్లతోపాటు, గ్రామీణ రోడ్లను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవిధంగా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అనంతరం పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఏలూరి జన్మదినం సందర్భంగా ఆయన ఫొటోతో ముద్రించిన వెయ్యి నోటు పుస్తకాలను అందజేసి అభిమానం చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి నక్కల వీరరాఘవలు, పొద వీరయ్య, ఎర్రాకుల గంగయ్య, నాలి నాగరాజు, సయ్యద్‌ మస్తాన్‌, ధిలీష్‌, ఎర్రాకుల సుబ్బారావు, మామిడిపాక హరిప్రసాద్‌, షేక్‌ గౌస్‌, తొండెపు ఆదినారాయణ, మానం సాంబశివరావు, తన్నీరు శివరామయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 10:54 PM