Share News

సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:30 PM

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ప్ర జాదర్బార్‌ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం
అర్జీలపై అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ప్ర జాదర్బార్‌ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి నియోజకవర్గం నుంచి వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వ్యక్తిగత సమస్యలతోపాటు గ్రామాల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అర్జీలను అందజేశారు.

కిడ్నీ బాధితుడికి ఎమ్మెల్యే సాయం

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు.పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన పోతుగంటి మౌలాబీ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధితురాలి కుమారుడు దస్తగిరిని పిలిపించి పరామర్శించారు. రూ.10వేల సాయాన్ని అందించారు. మౌలాబీకి మెరుగైన వైద్యం అందించాలని ఒంగోలులోని సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు.

Updated Date - Mar 23 , 2026 | 11:30 PM