Share News

ప్రజా సమస్యలను పరిష్కరించటమే లక్ష్యం

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:13 PM

గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించటమే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ల ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.

ప్రజా సమస్యలను పరిష్కరించటమే లక్ష్యం
మాట్లాడుతున్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దీర్ఘకాలిక రోడ్డు సమస్యకు పరిష్కారం

టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దొనకొండ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించటమే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ల ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. దొనకొండ నుంచి ఇండ్లచెరువు మీదుగా గజ్జలకొండ వరకు రూ.1.98 కోట్ల పీఆర్‌ఆర్‌ గ్రాంట్‌ నిధులతో మంజూరైన తారురోడ్డు నిర్మాణానికి బుధవారం ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ దొనకొండ నుంచి ఇండ్లచెరువు మీదుగా మార్కాపురం వెళ్లే రహదారి అధ్వానంగా తయారై ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తారు రోడ్డు మంజూరు చేయించామన్నారు. మంగినపూడి-అనంతవరం, చందవరం-బట్టెపాడు, కొచ్చెర్లకోట- నారపురెడ్డిపల్లె గ్రామాలకు త్వరలో రోడ్ల మంజూరుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వర్గాలకు తావులేకుండా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, జడ్పీటీసీ మాజీ సభ్యులు పులిమి రమణాయాదవ్‌, మండల టీడీపీ అధ్యక్షుడు మోడి ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, మోడి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సత్యానందం, టీడీపీ ఖత్తర్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం కోశాధికారి ఆంజనేయులు, దర్శి ఏఎంసీ డైరెక్టర్‌ శృంగారపు నాగసుబ్బారెడ్డి, నాయకులు వడ్లమూడి వెంకటాద్రి, దుగ్గెంపూడి చెంచయ్య, పత్తి వెంకటేశ్వర్లు, పోతిపోగు చెన్నయ్య, షేక్‌ తోహీద్‌, పెమ్మసాని లక్ష్మీనారాయణ, కుందుర్తి లక్ష్మణ్‌, ఫణిదపు వీరాంజనేయులు, వడ్లమూడి చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 11:13 PM