పేదల దాహార్తి తీర్చటమే ధ్యేయం
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:21 PM
పేద ప్రజల దాహార్తి తీర్చటమే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.
నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ముండ్లమూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల దాహార్తి తీర్చటమే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. ఆమె మంగళవారం మండలంలోని గంగన్నపాలెంలో తన సొంత నిఽధులు రూ.2 లక్షలతో నిర్మించిన ఆర్‌వో ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలందరూ తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేసి దాహార్తి తీరుస్తున్నట్లు చెప్పారు. గంగన్నపాలెంలో నీటి ఎద్దడి ఉందని గ్రామస్థులు తన దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే సొంత నిధులతో ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఒక వైపు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా మరో వైపు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించచేందుకు అనేక పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ, లలితసాగర్ దంపతులను నాయకులు వంగల శివారెడ్డి, పోతిరెడ్డి రాజగోపాలరెడ్డి, రాజారెడ్డి, దుక్కిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు సన్మానించారు. అనంతరం శంకరాపురంలో రెండు లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గోకులం షెడ్డును డాక్టర్ లక్ష్మీ, లలిత సాగర్ దంపతులు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, నేతలు సోమేపల్లి శ్రీనివాసరావు, సుంకర రాఘవరెడ్డి, సర్పంచ్ కూరపాటి మహేశ్వరి, నారాయణస్వామి, డాక్టర్ పాశం వెంకటరావు, ఎంపీటీసీ సభ్యులు పాలపర్తి సుబ్బారావు, చింతపల్లి వెంకటేశ్వర్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోడిగ మస్తాన్‌రావు, డీసీ చైర్మన్ కంచుమాటి శ్రీనివాసరావు, మందలపు అశోక్, అంజయ్య, మేదరమెట్ల వెంకటరావుతో పాటు ఎంపీడీవో ఎం శ్రీదేవి, పశు సంవర్ధక శాఖ ఉపసంచాలకులు ఏ పురుషోత్తంరాజు, ఏపీవో వెంకటరావు, ఏవో తిరుమలరావు, ఈసీ శివరామకృష్ణ పాల్గొన్నారు.