Share News

గ్రామాలలో వసతుల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - May 17 , 2026 | 11:26 PM

గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివా రం గిద్దలూరు మండలం కెఎ్‌సపల్లి పం చాయతీ పరిధిలోని పెద్దచెరువు గ్రామం లో రూ.30లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు.

గ్రామాలలో వసతుల కల్పనే లక్ష్యం
సీసీ రోడ్ల ప్రారంభ శిలాఫలకం వద్ద ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

రూ.30లక్షలతో నిర్మించిన రోడ్లు,

అంగన్‌వాడీ భవనం ప్రారంభం

గిద్దలూరు టౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివా రం గిద్దలూరు మండలం కెఎ్‌సపల్లి పం చాయతీ పరిధిలోని పెద్దచెరువు గ్రామం లో రూ.30లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గ్రా మాలలో వసతులు కల్పించడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాహనదారులు, పాదచారులు ప్రయాణాలు చేయొవచ్చన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను పరిష్కరించి, వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించి నట్లు తెలిపారు. వేసవిలో కూడా తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌, మండలపార్టీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, నాయకులు పాలుగుళ్ల ప్రతాపరెడ్డి, దప్పిలి భాస్కర్‌రెడ్డి, కాశిరెడ్డి, పాలుగుళ్ళ హనుమంతరెడ్డి, కడియం శేషగిరి, రిటైర్డ్‌ డీఎస్పీ బాలాజీనాయక్‌ ఉన్నారు. పెద్దచెరువు గ్రామంలో రూ.13లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 11:26 PM