Share News

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:29 PM

రాష్ట్రంలోని ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే స్వగృహంలో మంగళవారం సాయంత్రం రూ.1.07 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులను నియోజకవర్గంలోని అన్ని మం డలాలకు చెందిన 141 మందికి అందజేశారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే కందుల

మార్కాపురం టౌన్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే స్వగృహంలో మంగళవారం సాయంత్రం రూ.1.07 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులను నియోజకవర్గంలోని అన్ని మం డలాలకు చెందిన 141 మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్‌ వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ముఖ్యమం త్రి సహాయనిధి నుంచి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాగా ప్రజా ప్రభుత్వం పాలనసాగిస్తోందన్నారు. వైసీపీ హయాంలో కేవలం ఆ పార్టీ వారికి మాత్రమే లబ్ధి చే కూర్చారన్నారు. కానీ నేడు పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలా లు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్‌, తాళ్లపల్లి సత్యనారాయణ, కనిగిరి రమణ, కొప్పుల శ్రీనివాసులు, జవ్వాజి రామాంజులరెడ్డి, జంకె రమణారెడ్డి, మట్టం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:29 PM