Share News

రవాణా సౌకర్యాల అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:19 PM

ప్రజలకు రవాణా సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చేందుకు రోడ్లు అభివృద్ధి, కొత్త నిర్మాణాలను ప్రభుత్వం విరివిగా చేపడుతోందని విద్యుత్‌ శాఖ మంతి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

రవాణా సౌకర్యాల అభివృద్ధే లక్ష్యం

విద్యుత్‌ మంత్రి రవికుమార్‌

నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు

కనిగిరి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు రవాణా సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చేందుకు రోడ్లు అభివృద్ధి, కొత్త నిర్మాణాలను ప్రభుత్వం విరివిగా చేపడుతోందని విద్యుత్‌ శాఖ మంతి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలో మంగళవారం మంత్రి గొట్టిపాటి, జిల్లా పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి పర్యటించారు. అందులో భాగంగా కనిగిరి మున్సిపాల్టీ పరిధిలోని కందుకూరు రోడ్డు నుంచి గార్లపేట రోడ్డు వరకు 1కోటి 30 లక్షల రూపాయలతో నిర్మించిన శంఖవరం సీసీ రోడ్డును మంత్రి, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా తయారైనా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధి పనులతో పాటు విద్యుత్‌ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. విద్యుత్‌ సమస్యలు ఉత్పన్నమైన ప్రాంతాలను గుర్తించి అదనపు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లతో పాటు సబ్‌స్టేషన్ల నిర్మాణాలను చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పర్వతనేని శ్రీధర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, మండల పార్టీ కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), తమ్మినేని వెంకటరెడ్డి, తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, రోషన్‌ సంధాని, అహ్మద్‌, అంజుమన్‌కమిటీ అధ్యక్షుడు అహ్మద్‌, మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్‌ షేక్‌ వాజిదాబేగం, నజిముద్దీన్‌, బుల్లా బాలబాబు, గుడిపాటి ఖాదర్‌, నాగిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:19 PM