Share News

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ధ్యేయం

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:43 PM

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని బుడ్డపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ధ్యేయం
వేములపాడులో రైతులకు పీఎంకిసాన్‌ పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర,

ఎమ్మెల్యే కందుల

తర్లుపాడు, మార్చి 16 (ఆంధ్రజోతి) : రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని బుడ్డపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వెలిగొండను పూర్తి చేసి సాగునీరందించి రైతుల కష్టాలు తీరుస్తారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రైతులకు రూ.20వేలను అందజేస్తున్నారన్నారు. అనంతరం పలు సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కందుల తహసీల్దార్‌ కేకే కిషోర్‌కుమార్‌కు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాలాజీనాయక్‌, మార్కాపురం ఏఎంసీ చైర్మన్‌ వెంకటరెడ్డి, ఎంపీడీవో జయరామ్‌నాయక్‌, గ్రామ సర్పంచ్‌ డి. పెద్ద మస్తాన్‌, పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రైతుకిచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత ప్రజా ప్రభుత్వానిది : ఉగ్ర

హెచ్‌ఎంపాడు (కనిగిరి), మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : రైతుకిచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత చంద్రన్నకే దక్కుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు గ్రామంలో సోమవారం రాత్రి మీ కోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రఽ దాని నరేంద్రమోడీ సహకారంతో రైతులకు ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం కింద అందచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎస్టీఆర్‌, నాయకులు గాయం తిరుపతిరెడ్డి, రెడ్డెం తిరుపతిరెడ్డి, మురహరి నరసయ్య, చీకటి వెంకటసుబ్బయ్య, బ్రహ్మం గౌడ్‌, శ్యామల చినవెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

రైతులను అన్ని విధాలా

ప్రభుత్వం ఆదుకుంటుంది

కొమరోలు : రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని హసనాపురం గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి రైతులకు చేస్తున్న మేలు గురించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ గురించి వివరించారు. అనంతరం గ్రామంలోని రైతులతో సమావేశమై యోగక్షేమాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ బీ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ గోడి ఓబుల్‌ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, రవీంద్రారెడ్డి, పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, శ్రీశైలం ట్రస్ట్‌ సభ్యురాలు బోనేని రమణమ్మ, నాయకులు తిరుమలరెడ్డి, చలిచీమల శ్రీనివాసచౌదరి, తహశిల్దార్‌ భాగ్యలక్ష్మీ, ఎంపీడీవో రమేష్‌ బాబు, ఏవో రాజశ్రీ పాల్గొన్నారు.

మండలంలోని హసనాపురం గ్రామం లో శ్మశాన స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని స్థలాన్ని కేటాయించాలని ఎస్సీపాలెం వాసులు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని సోమవారం కోరారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. శ్మశాన స్థలం కేటాయించాలని తహసీల్దార్‌ భాగ్యలక్ష్మికి సూచించారు. రెండ్రోజుల్లో చూపిస్తామని తహసీల్దార్‌ తెలిపారు. అనంతరం గ్రామంలో పలువురిని ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, శ్రీశైలం ట్రస్ట్‌ సభ్యురాలు బోనేని రమణమ్మ, నాయకులు వేణుగోపాల్‌, ప్రసాద్‌, చెన్నకేశవులు, తిరుపతి, పుల్లయ్య, రామ్మోహన్‌ పాల్గొన్నారు.

ప్రతి గ్రామంలో రైతన్నా మీకోసం

గిద్దలూరు టౌన్‌ : నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతన్నా మీ కోసం నిర్వహించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వ్యవసాయాధికారులకు సూచించారు. సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గంలోని 6 మండలాల వ్యవసాయాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం నిర్వహించి ప్రతి రైతు ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్‌, కార్యాచరణ విధానాలను తెలియచేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

పట్టణంలో వసతుల ఏర్పాటు

పట్టణంలోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మౌళిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీచర్స్‌ కాలనీ, నల్లబండ బజారు, అర్భన్‌ కాలనీ, శ్రీరామ్‌నగర్‌లలో రూ.1.01కోట్లతో నిర్మించే సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేసి ఆయా ప్రాంతాలలో శిలాఫలకాన్ని ఆవిష్కరించా రు. అభివృద్ధి పనులు, నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, కమిషనర్‌ ఈవీ రమణబాబు, కౌన్సిలర్‌ బూనబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌, టీడీ పీ నాయకులు పాలుగుళ్ళ చిన్నశ్రీనివాసరెడ్డి, బిల్లా రమేష్‌, గోపాల్‌రెడ్డి ఉన్నారు.

రైతుల సంక్షేమానికి పెద్దపీట - టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం రూరల్‌ : రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జీ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం మండలంలోని నర్సాయపాలెం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌ బాబు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు రైతుల వద్దనే ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తుందన్నారు. దీని వలన దళారుల వద్ద రైతు మోసపోయే పరిస్థితి ఉండదని అన్నారు. గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి రైతులతో నేరుగా మాట్లాడారు. రైతుల సాయం కోసం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌ పథకం ద్వారా నగదు జమ చేసినట్లు గుర్తు చేశారు. కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోని పంట లాభాలను పొందాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయసంచాలకులు వెంకట రమణ, ఏఓ కే నీరజ, చిట్యాల వెంగల రెడ్డి, వేగినాటి శ్రీను, ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, సౌసైటి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:43 PM