Share News

పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందాలన్నదే లక్ష్యం

ABN , Publish Date - Oct 13 , 2026 | 10:51 PM

పేద వర్గాలకు చెందిన వారికి కూడా కార్పోరేట్‌ వైద్యం అందించాలన్నదే సీఎంఆర్‌ఎఫ్‌ విధాన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.

పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందాలన్నదే లక్ష్యం
వీవోఏలకు యూనిఫాంలను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి


ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

141 మందికి రూ.77లక్షల చెక్కుల పంపిణీ

కనిగిరి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : పేద వర్గాలకు చెందిన వారికి కూడా కార్పోరేట్‌ వైద్యం అందించాలన్నదే సీఎంఆర్‌ఎఫ్‌ విధాన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాతాలలోని పేద కుటుంభాలకు చెందిన 141 మందికి రూ.77లక్షల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. తాను సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరుకు చొరవ చేస్తే సీఎం చంద్రబాబు పెద్దమనసుతో వాటిని మంజూరు చేయించి పేదల ఇళ్ళల్లో దైవమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, కొండా కృష్ణారెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, మాజీ ఎంపీపీలు ప్రకాశం, నంబులు వెంకటేశ్వర్లు, మూలె బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవలో వీవోఏలు భాగస్వామ్యులు కావాలి

ప్రజా సేవలో వీఓఏలు భాగస్వామ్యులూ కావాలని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం వెలుగు వీఓఏలకు యూని ఫాం (చీరెలు) పంపిణీ చేశారు. సమాజంలో గుర్తింపు కోసం వీఓఏల కోరిక మేరకు యూనిఫాంలు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. ఈ యూనిఫాం వీఓఏల్లో ఐకమత్యం చాటుతుందన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 10:51 PM