Share News

బినామీల రద్దే లక్ష్యం

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:41 AM

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు ఉండి ఈకేవైసీ చేయించుకోని వినియోగదా రులపై ఆయిల్‌ కంపెనీలు దృష్టి సారించాయి. రెండు నెలల నుంచి ఆయా ఏజెన్సీల నిర్వాహకులు ఈకేవైసీ చేస్తున్నా కొందరు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.

బినామీల రద్దే లక్ష్యం

ఈకేవైసీ చేయించుకోని గ్యాస్‌ కనెక్షన్లపై దృష్టి

జిల్లాలో అటువంటివి 20వేలకుపైనే..!

కఠిన చర్యలకు ఆయిల్‌ కంపెనీల నిర్ణయం

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 8 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు ఉండి ఈకేవైసీ చేయించుకోని వినియోగదా రులపై ఆయిల్‌ కంపెనీలు దృష్టి సారించాయి. రెండు నెలల నుంచి ఆయా ఏజెన్సీల నిర్వాహకులు ఈకేవైసీ చేస్తున్నా కొందరు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మరోసారి అవకాశం కల్పించి అప్పటికి కూడా ఈకేవైసీ చేయించుకోక పోతే కనెక్షన్‌లను రద్దుచేసేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. జిల్లాలో 49 ఏజెన్సీల పరిఽధిలో 6.82 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. అందులో సుమారు 20వేల కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులు ఏడాదిగా ఈకేవైసీ చేయిం చుకోలేదు. వారికి ఆయిల్‌ కంపెనీలు మరోసారి అవకాశం ఇచ్చాయి. ఈసారి చేయించుకోని పక్షంలో ఆ కనెక్షన్లను బినామీవిగా భావించి రద్దు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా గ్యాస్‌ ఏజెన్సీల్లో పనిచేసే నిర్వాహకులు వినియోగదారులకు ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించారు. వారి సెల్‌ఫోన్‌ నెంబర్లకు ఫోన్లు చేసి ఈకేవైసీ చేయించుకోకపోతే సిలిండర్లను నిలిపివేస్తామని సమాచారాన్ని కూడా ఇచ్చారు. గతంలో గ్యాస్‌ సిలిండర్‌ తీసుకొని ప్రస్తుతం అందుబాటులో లేని వినియోగదారుడి వారసుల పేరుతో ఏజెన్సీల్లో పేర్ల మార్పిడి ప్రక్రియను కూడా చేపట్టారు. ఈసారి ఈకేవైసీ చేయించుకోకపోతే ఆ 20వేలకుపైగా ఉన్న కనెక్షన్లను పూర్తిస్థాయిలో నిలిపివేయనున్నట్లు సమాచారం.

Updated Date - Jul 09 , 2026 | 02:41 AM