ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:22 AM
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు. మార్కాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో ఆయన పాల్గొన్నారు.
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
మార్కాపురం టౌన్, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు. మార్కాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 47 మందితో ముఖాముఖి మాట్లాడారు. అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీసు స్టేషన్‌ల సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా కార్యాలయానికి రాలేనివారు అందుబాటులో ఉన్న పోలీసు స్టేషన్లు, సర్కిల్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరిధిలో సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘మీకోసం’లో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భర్త, అత్తంటి వేధింపులు, చీటింగ్, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం తదితర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి సీఐలు అల్తాఫ్ హుస్సేన్, కె.అజయ్ కుమార్, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.