Share News

అభ్యర్థుల లెక్కతేలేది రేపే..!

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:02 PM

ఒంగోలులో నామినేషన్ల ఘట్టం ముగిసింది. పత్రాలు పరిశీలన పొద్దుపోయే వరకు సాగింది. ఇక అభ్యర్థుల లెక్క తేలేది రేపే కావడంతో ఆశావాహులు బీ ఫాం తమకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వద్ద రాయబారాలు నడుపుతున్నారు.

అభ్యర్థుల లెక్కతేలేది రేపే..!

సీట్ల ఖరారుకు టీడీపీ ఐవీఆర్‌ఎస్‌ సర్వే

ఒంగోలు కార్పొరేషన్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో నామినేషన్ల ఘట్టం ముగిసింది. పత్రాలు పరిశీలన పొద్దుపోయే వరకు సాగింది. ఇక అభ్యర్థుల లెక్క తేలేది రేపే కావడంతో ఆశావాహులు బీ ఫాం తమకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వద్ద రాయబారాలు నడుపుతున్నారు. ఒంగోలులో భారీగా 635 నామినేషన్లు దాఖలు కావడంతో ఒక్కో పార్టీ నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు కార్పొరేటర్‌ సీటును ఆశిస్తుండగా, ప్రజాదరణ ఉన్న వారికే సీటు కేటాయించనున్నారు. అందుకు సంబంధించి డివిజన్ల వారీగా పోటీలో నిలిచిన వారి పేర్లుతో ఐవీఆర్‌ఆఎస్‌ సర్వే నిర్వహించారు. నామినేష్ల దాఖలు ప్రక్రియ ముగియనుండటంతో బీఫారాలు అందజేయడమే ఇక తరువాయి. ఇదిలా ఉండగా నామినేషన్లు దాఖలు చేసిన రాజకీయపార్టీల అభ్యర్థులు, స్వతంత్య్ర అభ్యర్థులు, ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. తాము పోటీ చేసే డివిజన్‌ పేర్లు తెలియజేస్తూ తమ ఎన్నికల గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారానికి తెరలేపారు. అయితే ఇప్పటి వరకు నామినేషన్లు మాత్రమే జరగ్గా అధికారకంగా ఆయా రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులను ఖరారు చేసి బుధవారం బీ ఫాంలు అందజేయన్నారు. నగరంలో ఎన్నికల సందడి మొదలైంది.

Updated Date - Oct 19 , 2026 | 11:02 PM