Share News

దళితుల రక్షణే కర్తవ్యం

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:06 AM

దళితుల హక్కులు, వారి రక్షణే కర్తవ్యం అని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ అన్నారు. బుధవారం ఎర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామ ఎస్సీపాలెంలో ఆయన కమిషన్‌ సభ్యులతో కలిసి పర్యటించారు.

దళితుల రక్షణే కర్తవ్యం
గుడిపాడులో దళితుల స్థలానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్న ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌

త్రిపురాంతకం, వైపాలెంలో పర్యటన

ఎర్రగొండపాలెం రూరల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : దళితుల హక్కులు, వారి రక్షణే కర్తవ్యం అని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ అన్నారు. బుధవారం ఎర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామ ఎస్సీపాలెంలో ఆయన కమిషన్‌ సభ్యులతో కలిసి పర్యటించారు. శ్మశాన స్థలాన్ని అగ్రకులానికి చెందిన కొందరు ఆక్రమించారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్‌ డి.మంజునాథరెడ్డి, సర్వేయర్‌ సిలార్‌ఖాన్‌, వీఆర్వో మోహన్‌రావుతో మాట్లాడారు. భూ రికార్డులు, మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ జవహర్‌ మాట్లాడుతూ మరోసారి ఈనెల 28వ తేదీన వచ్చి స్థల వివాదంపై ఇరువర్గాలతో మాట్లాడి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ పాలెంలో పర్యటించిన ఆయన వృద్ధులు, మహిళలు, పిల్లలను పలుకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు జవహర్‌కు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు పాకనాటి గౌతవ్‌ రాజు, ఎన్‌టీ రామంజినమ్మ, మేకల భిక్షం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్‌, పలువురు ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. అంతకముందు త్రిపురాంతకంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొందిన జాన్‌సామ్యూల్‌ కుటుంబ సభ్యులను చైర్మన్‌ జవహర్‌, టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కలిసి ఉపాధ్యాయ దంపతులను సన్మానించారు.

Updated Date - Apr 23 , 2026 | 03:06 AM