తీరం.. అభివృద్ధికి హారం
ABN , Publish Date - Aug 08 , 2026 | 02:56 AM
తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అభివృద్ధికి ఆకాశమే హద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్‌గా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే శనివారం వస్తే హైదరాబాద్ నుంచి విపరీతంగా పర్యాటకులు చీరాల, సూర్యలంక బాట పడుతున్నారన్నారు. మరో గోవాగా ఇక్కడి తీరాన్ని మార్చబోతున్నామని సీఎం చెప్పారు. చీరాల పరిధిలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్ని నేత న్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారు.
సూర్యలంక - చీరాల మధ్య కారిడార్
ప్రపంచమే ఇక్కడి బీచ్‌ల వైపు చూసేలా చర్యలు
జాతీయ చేనేత దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు
చీరాల నియోజకవర్గంపై వరాల జల్లు
బాపట్ల కలెక్టర్, ఎస్పీకి ప్రత్యేకంగా అభినందనలు
చీరాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అభివృద్ధికి ఆకాశమే హద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్‌గా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే శనివారం వస్తే హైదరాబాద్ నుంచి విపరీతంగా పర్యాటకులు చీరాల, సూర్యలంక బాట పడుతున్నారన్నారు. మరో గోవాగా ఇక్కడి తీరాన్ని మార్చబోతున్నామని సీఎం చెప్పారు. చీరాల పరిధిలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్ని నేత న్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. అన్నీ అనుకూలిస్తే చీరాల పక్కనే ఓ చిన్న ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటకులను ఇక్కడకు రప్పిస్తామన్నారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్ కింద పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధుల సాధనకు కృషి చేస్తామన్నారు. చీరాల నియోజ కవర్గంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే కొండయ్య సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. చీరాల క్టస్టర్ హ్యాండ్ లూమ్ స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.15కోట్లు, మున్సిపాలిటీ పరిధిలోని దొండపాడు రోడ్డుకు రూ.20 కోట్లు, చీరాల బీచ్ ఫ్రంట్ డెవలప్‌మెం ట్‌కు రూ.30 కోట్లు, మున్సిపాలిటీలో డ్రైనేజీ బాగుకోసం రూ.8కోట్ల ప్రతిపాదనలు సీఎంకు అందగా వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజావేదిక ప్రాంగణంలో చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా బాపట్ల పర్యాటక రంగ అభివృద్ధిపై రూపొందించిన బే ఆఫ్ బాపట్ల వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. జిల్లా ప్రజలు ఈ సైట్ ఆధారంగా తమ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని కలెక్టర్ సీఎంకు వివరించారు. ఎల్‌ఈపీఎస్ స్టాల్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చే శిక్షణ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేతలు రూపొందించిన కుప్పడం చీరాల ప్రదర్శనను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్టాల్స్‌లో ఆసక్తిగా తిలకించారు. చీరాల కుప్పడం చీరకు జాతీయ అవార్డు లభించడం సంతోషమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చేనేత కార్మికులతో సీఎం కాసేపు ముచ్చటించారు.
చంద్రన్న రాకతో హుషారు
సీఎం చంద్రబాబు మాట్లాడినంత సేపు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. కార్యక్రమం జరిగినంత సేపు జనం హుషారుగా కనిపించారు. మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కృష్ణప్రసాద్, కలెక్టర్ డా.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, నరేంద్రవర్మ, నక్క ఆనందబాబు, బీఎన్.విజయకుమార్, ఎమ్మెల్సీ సునీత, జౌళిశాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా, ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ ఉమామహేశ్వర్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు సలగల రాజశేఖరబాబు, ప్రధాన కార్యదర్శి నక్కల వీరరాఘవులు, సిఽధ్ధి బుచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొంతసేపు గందరగోళం
పార్టీ క్యాడర్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో గందరగోళం నెలకొంది. 1,230 మందికి పాస్‌లు పంపిణీ చేయగా కొంతమేరకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వెయ్యి మందికి మించి లోపలికి అనుమతించలేదు. స్పెషల్ భద్రత సిబ్బంది(ఎన్‌ఎస్‌జీ) కార్యకర్తల మాటలు చెవికెక్కించుకోకపోవడంతో సుమారు 200 మందికి అనుమతి లభించలేదు. వీరిలో కొందరు ప్రముఖులు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.