రామతీర్థం తిరునాళ్ల సంరంభం ఆరంభం
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:03 PM
రామతీర్థం తిరునాళ్ల సంబరాల సందడి మొదలైంది. మంగళవారం మందిరాల సంబరాలు చీమకుర్తిలో, బుధవారం రామతీర్థంలో తిరునాళ్ల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించటానికి సర్వం సిద్ధమైంది.
నిధికి తరలుతున్న ప్రభల తడికలు
చీమకుర్తి, మార్చి 29(ఆంధ్రజ్యోతి) : రామతీర్థం తిరునాళ్ల సంబరాల సందడి మొదలైంది. మంగళవారం మందిరాల సంబరాలు చీమకుర్తిలో, బుధవారం రామతీర్థంలో తిరునాళ్ల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించటానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ప్రభ తడికను ఊరేగింపుగా రామతీర్థం నిధికి తరలించారు. జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్యెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, నాయకులు మన్నం శ్రీధర్‌బాబు, పమిడి వెంకటేశ్వర్లు, శేఖరరెడ్డి, మస్తాన్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభల తడికలను సోమవారం, జనసేన ఆధ్వర్యంలో తడికను మంగళవారం ఊరేగింపుగా తరలించనున్నారు.