యాప్ యాతన!
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:05 AM
సేవలను సరళతరం చేయాల్సిన ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం రైతుల విషయంలో మరింత గందరగోళం సృష్టి స్తోంది. వారికి నష్టం కలిగిస్తోంది.
ఏపీఏఐఎంఎస్‌తో గందరగోళం
టెక్నాలజీపై అవగాహన కరువు
ప్రారంభమమైన వర్షాలు
ఎరువుల కోసం రైతుల పరుగు
బ్లాక్ మార్కెట్ చేస్తున్న వ్యాపారులు
డీఏపీపై బస్తాకు రూ.300, యూరియాపై
రూ.150 వరకు అదనపు బాదుడు
సేవలను సరళతరం చేయాల్సిన ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం రైతుల విషయంలో మరింత గందరగోళం సృష్టి స్తోంది. వారికి నష్టం కలిగిస్తోంది. యూరియా, డీఏపీ వాడ కాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ రెండిం టినీ ఏపీఏఐఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా మాత్రమే విక్రయించాలని నిబంధన పెట్టడం ఇందుకు కారణమైంది. రైతులకు వ్యవసాయ శాఖ ఎటువంటి అవగాహన కల్పించకుండానే కొనుగోళ్లకు యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేయడంతో ఇదే అదనుగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారు.
కందుకూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : రైతులకు యాప్ యాతన నెలకొంది. నూతన నిబంధనల ప్రకారం ఏపీఏఐఎంఎస్ యాప్‌ను రైతులు తమ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఆధార్ నెంబరు ద్వారా నమోదు కావాలి. అప్పుడు ఆ యాప్‌లో సంబంధిత రైతుకు ఎంత భూమి ఉంది, ప్రస్తుతం అందులో ఏయే పంటలు సాగులో ఉన్నాయి, ఆ పంటలకు తొలివిడతగా ప్రస్తుతం ఎంత డీఏపీ, యూరియా పొందేందుకు అర్హత ఉంది అన్నది తెలుస్తుంది. ఆ యాప్‌లో సంబంధిత రైతు అర్హత ఉన్న పరిమాణం వరకు దుకాణంలోనైనా ఎరువులను పొందవచ్చు. అంతకుమించి డీఏపీ, యూరియా ఇవ్వరు.
యాప్‌పై రైతులకు అవగాహన నిల్
ఏపీఏఐఎంఎస్ యాప్‌పై రైతులకు కనీస అవ గాహన కల్పించ లేదు. వ్యవసాయ శాఖ అధికారులు తమ క్షేత్రస్థాయి సిబ్బందికి, ఎరువుల డీలర్లకు మాత్రమే యాప్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. వారు రైతులకు దీనిపై అవగాహన కల్పించలేదు. కేవలం కొందరి సెల్ ఫోన్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేశారు. దీంతో ఐదు శాతం మంది కూడా ఈ యాప్‌లో నమోదు కాలేదు. వారికి ఎలాంటి సాంకేతిక సహకారం లభించడం లేదు. మరోవైపు యాప్‌లో నమోదుచేసుకున్న వారికి కూడా ఈ-క్రాప్ సక్రమంగా జరగక ప్రస్తుతం ఎలాంటి పంటలు సాగులో లేవని ఎరువుల కోటా కేటాయించబడటం లేదు. అలాగే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో వరికి తప్ప మిగిలిన పంటలకు డీఏపీ కేటాయింపు లేకపోవడం కూడా రైతులకు ప్రతిబంధకంగా మారింది. దీంతో వారు డీఏపీ, యూరియా ఎరువుల కోసం పరుగులు తీస్తున్నారు. కందుకూరు ప్రాంతంలోనే కాక జిల్లావ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉన్నాయి.
ఆర్‌ఎస్‌కేలలో నిల్వలు లేవు
సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. యాప్ అమల్లోకి రాకముందు ఇబ్బడిముబ్బడిగా నిల్వలు పెట్టుకున్న వ్యాపారులు ప్రస్తుతం బ్లాక్ మార్కెటింగ్‌తో సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ఇంతవరకు ఎక్కడా రైతు సేవా కేంద్రాలలో ఎరువుల నిల్వలు ఉంచేందుకు వ్యసాయాధికారులు చర్యలు తీసుకోకపోవడం కూడా సమస్యకు ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. ఏపీఏఐఎంఎస్ యాప్‌పై అవగాహన కల్పించడంతోపాటు అందరినీ యాప్‌లో నమోదయ్యేలా వ్యవసాయ శాఖ క్షేత్రసిబ్బంది చర్యలు తీసుకునేలా చూడాలని, ఎరువుల సమస్య రాకుండా ఆర్‌ఎస్‌కేలలో నిల్వలు ఉంచాలని రైతులు కోరుతున్నారు.
సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
కందుకూరు ప్రాంతంలో ఇటీవల కాలంలో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో భూములు పూర్తిస్థాయిలో పదున య్యాయి. కందుకూరు మండలంలో ఈనెలలో మొత్తంగా 10 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఈ సబ్ డివిజన్‌లో 7 సెం.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. దీంతో వేలాది ఎక రాలలో సాగుచేసి ఉన్న జామాయిల్, సరుగుడు తోటలకు ఎరువులు వేసేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. డీఏపీ, యూరియా కోసం డీలర్ల వద్దకు వెళ్తుండగా వారు ఏపీఏఐఎంఎస్ యాప్ ఉంటేనే అందులో మీకు ఎంత ఇవ్వవచ్చో చూసుకుని మాత్రమే ఇస్తామంటున్నారు. అది ఏ మూలకూ సరిపోదని గ్రహిస్తున్న రైతులు ఎలాగోలా అవ సరం మేరకు డీఏపీ, యూరియా ఇవ్వాలని ప్రాథేయపడు తున్నారు. ఇదేఅదనుగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీసి సొమ్ము చేసుకుంటున్నారు. డీఏపీ బస్తా రూ.1,450కి విక్రయించాల్సి ఉండగా కందుకూరు సబ్ డివిజ న్‌లోని లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెంలాంటి ప్రాంతాలలో బస్తాకు రూ.300 అదనంగా వసూలు చేస్తున్నారు. యూరియా బస్తా రూ.270కి విక్రయించాల్సి ఉండగా రూ. 150 అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి. కందుకూరు పట్టణంలోనూ బ్లాక్ మార్కెటింగ్ నడుస్తోంది.