సమస్యల పరిష్కారమే అజెండా
ABN , Publish Date - Mar 21 , 2026 | 10:38 PM
సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే వెంటనే పరిష్కరించడమే తన ప్రధాన అజెండా అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే వెంటనే పరిష్కరించడమే తన ప్రధాన అజెండా అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని కశెట్టివారి వీధిలో నటుకుల శ్రీనివాసులు స్వగృహంలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆవీధి మహిళలు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కలిసి డ్రైనేజీ సౌకర్యం లేదని, 3 దశాబ్దాల కిందట నిర్మించిన సిమెంటు రోడ్డు అధ్వానంగా ఉన్న దృష్ట్యా కొత్త రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. 3 నెలల్లోగా రోడ్డు నిర్మాణం చేయిస్తానని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. గుండ్లమోటు నీటి పైపులైన్ నుంచి తమ వీధికి మంచినీటి సౌకర్యం కల్పించాలని, తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నందున ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాటిని సరి చేయించాలని ఆప్రాంతవాసులు కోరగా వారంలోగా పరిష్కరించాలని కమిషనర్ రమణబాబును, ట్రాన్స్‌కో ఏఈ నారాయణరెడ్డిని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అక్కడికక్కడే ఆదేశించారు. కూటమి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులను, త్వరలో జరుగబోయే పనులు గురించి, పట్టణ సుందరీకరణ గురించి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో కుసుమ హరనాథ మందిరం అధ్యక్షుడు నటుకుల శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు దమ్మాల జనార్థన్, జిలకర సత్యనారాయణ, వాడకట్టు శివప్రసాద్, ముప్పూరి చంటి, మాజీ కౌన్సిలర్ అన్నా రమణ పాల్గొన్నారు.