Share News

5 నుంచి టెట్‌

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:48 AM

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌)కు సంబంధించి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రకారం ఆగస్టు 5 నుంచి 16 వరకు ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్ష నిర్వహించనున్నారు.

5 నుంచి టెట్‌

ఒంగోలులోని మూడు కేంద్రాల్లో నిర్వహణ

ఒంగోలు విద్య, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌)కు సంబంధించి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రకారం ఆగస్టు 5 నుంచి 16 వరకు ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఒంగోలులో మూడు కేంద్రా లను ఏర్పాటు చేశారు. బ్రిలియంట్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలోని కేంద్రంలో 2,200 మంది, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ది చర్చ్‌ సోషల్‌ యాక్షన్‌ ఇండియా సెంటర్‌లో 2,060 మంది, రైజ్‌ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసే కేంద్రంలో 660 మంది అభ్యర్థులను కేటాయించారు. ఏపీ టెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌ నుంచి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.

Updated Date - Jul 29 , 2026 | 02:48 AM