Share News

పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:39 AM

జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పాఠ శాల విద్య గుంటూరు ఆర్‌జేడీ బి.లింగేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పాత జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారుల సమావే శంలో ఆయన మాట్లాడారు.

పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న పాఠశాల విద్య ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి

పాఠశాల విద్య ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి

ఒంగోలు విద్య, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పాఠ శాల విద్య గుంటూరు ఆర్‌జేడీ బి.లింగేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పాత జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారుల సమావే శంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 165 కేంద్రాలు ఏర్పాటు చేయగా 28,632 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికా రులు సమన్వయంతో పనిచేసి ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలన్నారు. చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఏచిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ జారీచేసిన మార్గదర్శకాలను అర్థం చేసుకొని పరీక్షలు నిర్వహించాలన్నారు. నిర్వహణలో మొదటి రోజు ఎంతో కీలకమని, అందువల్ల విద్యార్థులకు సరైన ప్రశ్నపత్నాలు అందించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డీఈవో రేణుక మాట్లాడుతూ చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు పరీక్షల విధులను ధైర్యంగా నిర్వహించాలన్నారు. అందుకు అన్ని విషయాల్లో జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. స్టోరేజీ పాయింట్లలో ప్రశ్నపత్రాలను భద్రపర్చేందుకు ట్రంకు పెట్టెలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆ పెట్టెల్లో ప్రశ్నపత్రాల బండిళ్లను భద్రపరిచే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మార్కాపురం జిల్లా పరీక్షల పరిశీలకులు గీత, ఉప విద్యాధికారులు శ్రీనివాసరెడ్డి, చంద్రమౌళీశ్వర్‌, ఏసీఎం శ్రీనివాసరావు, ఒంగోలు ఎంఈవో కిషోర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 01:39 AM