వెబ్‌ల్యాండ్‌లో సాంకేతిక సమస్యలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:34 AM
జిల్లాల పునర్విభజనలో భాగంగా అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం పరిధిలోకి చేరింది. జిల్లా మార్పు సమయంలో రెవెన్యూపరంగా అద్దంకి నియోజకవర్గంలోని భూములను ప్రకాశంలోకి మార్చారు.
పలువురి భూములు మాయం
ఆందోళన చెందుతున్న రైతులు
అద్దంకి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాల పునర్విభజనలో భాగంగా అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం పరిధిలోకి చేరింది. జిల్లా మార్పు సమయంలో రెవెన్యూపరంగా అద్దంకి నియోజకవర్గంలోని భూములను ప్రకాశంలోకి మార్చారు. ఆసమయంలో వెబ్‌ల్యాం డ్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో పలుగ్రామాల్లోని కొంతమంది రైతుల భూములు ప్రస్తుతం అనుభవంలో ఉన్న వారి పేర్లతో కాకుండా గతంలో ఉన్న రైతుల పేర్లతో కనిపి స్తున్నాయి. దీంతో వారు ఆందోళన చెందు తున్నారు. భూమి క్రయ, విక్రయాల సమయంలో, పంట రుణాల కోసం వెబ్‌ల్యాండ్‌లో పరిశీలించిన ప్పుడు ఇతరుల పేర్లు కనిపిస్తున్నాయి. వాటిని సరిచేయించేందుకు గత రెండు నెలలుగా తహసీ ల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రు. పలు గ్రామాల్లో 10 నుంచి 20 శాతం మంది రైతుల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో మిస్ అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈసమస్య అద్దంకి మండ లంలోని చినకొత్తపల్లి, మోదేపల్లి, నన్నూరపాడు రెవెన్యూ పరిధిలో ఎక్కువగా ఉంది. ఉన్నతాధికా రులు స్పందించి వెంటనే వెబ్‌ల్యాండ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈవిషయమై అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్‌ను వివరణ కోరగా.. కొంతమంది రైతుల భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో లేకపోవడాన్ని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సాంకేతిక సమస్య పరిష్కారమైన తరు వాత రైతుల భూముల వివరాలు యథావిధిగా నమోదవుతాయని ఆయన తెలిపారు.