పాఠశాలలకు సర్దుబాటు టీ చర్లు
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:02 AM
ఉమ్మడి జిల్లాలో మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తవడంతో సోమవారం వారు కోరుకున్న కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాలో 74 మంది, మార్కాపురం జిల్లాలో 70 మంది కలిపి 144మంది మిగులు టీచర్లను గుర్తించారు.
కోరుకున్న చోట బాధ్యతల స్వీకరణ
ఒంగోలు విద్య, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తవడంతో సోమవారం వారు కోరుకున్న కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాలో 74 మంది, మార్కాపురం జిల్లాలో 70 మంది కలిపి 144మంది మిగులు టీచర్లను గుర్తించారు. వీరిలో నలుగురు మినహా మిగిలిన 140 మందిని మండల, డివిజన్ స్థాయి కౌన్సెలింగ్‌లో ఉపాఽధ్యాయులు అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించారు. డివిజన్‌స్థాయి కౌన్సెలింగ్‌లో నలుగురు 75శాతంపైగా వైకల్యం ఉన్నవారు రావడంతో వారికి సర్టుబాటు కౌన్సెలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన 140మందికి ఉమ్మడి జిల్లా డీఈవో సీవీ రేణుక పేరుతో బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిని సంబంధిత టీచర్ల మొబైల్‌లోని లీప్‌యాప్‌కు పంపారు. వాటిని టీచర్లు సోమవారం డౌన్‌లోడ్ చేసుకొని ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ అయి సోమవారమే కొత్త పాఠశాలల్లో చేరిపోయారు.