Share News

27 నుంచి ఇంటింటికీ టీడీపీ

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:14 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకోసం ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన ఇంటింటికీటీడీపీ కార్యక్రమాన్ని పార్లమెంట్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల శ్రేణులు విజయవంతం చేయాలన్నారు.

27 నుంచి ఇంటింటికీ టీడీపీ
ఇంటింటికీ టీడీపీ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

పోస్టర్‌ను ఆవిష్కరించిన పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కూటమి పాలన విజయాలను ప్రజలకు వివరించాలని శ్రేణులకు పిలుపు

ఒంగోలు జూలై 21 (ఆంఽధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకోసం ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన ఇంటింటికీటీడీపీ కార్యక్రమాన్ని పార్లమెంట్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో పార్టీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, ఇతర నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ పనితీరుపై వారిలో మరింత విశ్వాసం పెంపొందించేలా చూడాలన్నారు. అనంతరం పార్లమెంట్‌ కమిటీ నాయకులతో కలిసి స్థానిక భాగ్యనగర్‌లో జరుగుతున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్‌ కమిటీ నాయకులు షేక్‌ ఆరిఫా, జి.శ్రీనివాస రావు, కె.అంకరాజు, టి.శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 01:14 AM