Share News

టీడీపీకే ఒంగోలు డిప్యూటీ మేయర్‌

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:02 PM

జిల్లాలో సోమవారం కొలువుదీరనున్న అర్బన్‌ స్థానిక సంస్థల్లో ఏడు చోట్ల వైస్‌చైర్మన్‌ పదవులు టీడీపీకి దక్కాయి. ఒక్క మార్కాపురం మాత్రం జనసేనకు కేటాయించారు. ప్రతిష్ఠాత్మకమైన ఒంగోలు డిప్యూటీ మేయర్‌ పదవిని టీడీపీ నిలుపుకోగలిగింది. ఆపదవి కోసం తొలుత జనసేన పట్టుబట్టినప్పటికీ ఇటీవల జడ్పీ వైస్‌చైర్మన్‌ పదవిని తీసుకున్నందున డిప్యూటీ మేయర్‌ను ఆశించకూడదన్న నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్లు తెలిసింది.

టీడీపీకే ఒంగోలు   డిప్యూటీ మేయర్‌

జన్‌జీకి అధిష్ఠానం ప్రాధాన్యం

జనసేనకు మార్కాపురం వైస్‌చైర్మన్‌

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో సోమవారం కొలువుదీరనున్న అర్బన్‌ స్థానిక సంస్థల్లో ఏడు చోట్ల వైస్‌చైర్మన్‌ పదవులు టీడీపీకి దక్కాయి. ఒక్క మార్కాపురం మాత్రం జనసేనకు కేటాయించారు. ప్రతిష్ఠాత్మకమైన ఒంగోలు డిప్యూటీ మేయర్‌ పదవిని టీడీపీ నిలుపుకోగలిగింది. ఆపదవి కోసం తొలుత జనసేన పట్టుబట్టినప్పటికీ ఇటీవల జడ్పీ వైస్‌చైర్మన్‌ పదవిని తీసుకున్నందున డిప్యూటీ మేయర్‌ను ఆశించకూడదన్న నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ మేయర్‌గా టీడీపీ నుంచి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీ అధిష్ఠానం జన్‌జీల వైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా యువతకే అవకాశం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే జనార్దన్‌కు సూచించినట్లు తెలిసింది. దీంతో ఆయన తుది నిర్ణయానికి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. చీరాల, అద్దంకి, చీమకుర్తి, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు వైస్‌చైర్మన్‌ పదవులు టీడీపీకే దక్కాయి. మార్కాపురం వైస్‌చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించారు. ఆ మునిసిపాలిటీలో జనసేన నుంచి కౌన్సిలర్‌లుగా ఆరుగురు గెలుపొందారు. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కాశీవిశ్వనాథ్‌ ఎంపిక చేసిన వారికి వైస్‌చైర్మన్‌ పదవి దక్కనుంది.

Updated Date - Nov 22 , 2026 | 11:02 PM