పన్నుభారం ‘సగం’పోయింది!
ABN , Publish Date - Apr 26 , 2026 | 02:37 AM
నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఖాళీ స్థలాల పన్ను తగ్గిస్తూ ప్రజా ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలావీఎల్‌టీ (వేకెంట్ ల్యాండ్ టాక్స్)లో 50శాతం రాయితీ కల్పిస్తూమునిసి పల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్‌మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఖాళీ స్థలాలపై పన్ను రాయితీ
50శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
పట్టణ ప్రజలకు ఊరట
ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.4.43 కోట్లు లక్ష్యం
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఖాళీ స్థలాల పన్ను తగ్గిస్తూ ప్రజా ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలావీఎల్‌టీ (వేకెంట్ ల్యాండ్ టాక్స్)లో 50శాతం రాయితీ కల్పిస్తూమునిసి పల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్‌మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోను గత తెలుగుదేశం ప్రభు త్వం 2019లోనే విడుదల చేయగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించడం ఇష్టంలేక పక్కన పెట్టేసింది. తాజాగా ప్రభుత్వం వీఎల్‌టీ తగ్గించడం కోసం మునిసిపల్ చట్టాన్ని సవరణ చేసింది. ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు కార్పొరేష న్‌తోపాటు, ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయతీలలో ఈ రాయితీ వర్తిస్తుంది.
50 శాతం రాయితీ అమలు ఇలా..
ఇప్పటి వరకూ ఖాళీస్థలాలకు సంబంధించి అనుమతులు తీసుకున్న నాటి నుంచి నిర్మాణం పూర్తి చేసేలోపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్థలం విలువపై కార్పొరేషన్‌లో 0.5శాతం, ముని సిపాలిటీలలో 0.2 శాతం చొప్పున ఖాళీ స్థలాల పన్ను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం అందు లో 50శాతం రాయితీ ఇస్తుండటంతో ప్రజలకు మరింత మేలు చేకూరనుంది. గత కొన్నేళ్లుగా ఖాళీ స్థలాల పన్నును 100 శాతం చెల్లిస్తుం డగా, నూతన జీవో ద్వారా భవన నిర్మాణ ప్లాన్ పొందినప్పటి నుంచి మాత్రమే50శాతం పన్నురాయితీ వర్తిస్తుంది. భవన నిర్మాణం చేపట్ట కుండా ఖాళీ స్థలాన్ని వదిలేసి ఉంచితే గతంలో మాదిరి 0.5 శాతం పన్ను వసూలు చేస్తారు.
ఏడాదికి రూ.4.43 కోట్లు లక్ష్యం
జిల్లావ్యాప్తంగా ఖాళీస్థలాలకు సంబంధించి 8,214 అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వాటి నుంచి ఏడాదికి రూ.4.43 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే గత బుధవారం నాటికి ఒంగోలు తోపాటు అన్ని మునిసిపాలిటీలలో పాత బకా యిలు రూ.11.88 కోట్లు ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి ఖాళీ స్థలాల పన్ను రూ.4.43 కోట్లు వసూలు చేయాలి. అలా మొత్తం డిమాండ్ రూ.16.32 కోట్లు రాబట్టాల్సి ఉంది. పురపాలక శాఖ తాజా ఉత్తర్వులతో ఖాళీస్థలాల పన్నులో 50శాతం రాయితీ ప్రకటించడంతో పన్ను పరిధిలోకి వచ్చే స్థలాలు పెరగడంతోపా టు వసూళ్లు కూడా అధికమొత్తంలో అయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.