తౌషిక్ తల్లి మౌలాబి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:41 PM
సింగరాయకొండ, మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న కనిగిరికి చెందిన ఆరో తరగతి విద్యార్థి షేక్ తౌషిక్(11) పాఠశాల హాస్టలోని బాత్‌రూంలో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు.
న్యాయం చేయాలని కుమారుడు మృతి చెందిన శ్రీచైతన్య నవోదయ పాఠశాల హాస్టల్ ఎదుట నిరసన
మధ్యాహ్న సమయంలో గడ్డిమందు తాగుతుండడంతో గమనించి అడ్డుకున్న మహిళా హోంగార్డు
హుటాహుటిన 108లో ఒంగోలు రిమ్స్‌కు తరలింపు
సింగరాయకొండ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న కనిగిరికి చెందిన ఆరో తరగతి విద్యార్థి షేక్ తౌషిక్(11) పాఠశాల హాస్టలోని బాత్‌రూంలో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. కొన్ని రోజులుగా తన కుమారుడు మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని హాస్టల్‌ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట రోడ్డుపై మౌలాబి నిరసన దీక్ష చేస్తోంది. గురువారం ఎప్పటి లాగానే మధ్యాహ్న సమయంలో పాఠశాల ఎదుట దీక్షకు కూర్చొంది. ఒక గంట తరువాత మౌలాబి గడ్డిమందు తాగుతుండగా పక్కనే ఉన్న మహిళా హోంగార్డు గమనించి ఆమె చేతిలోని డబ్బాను పక్కకు నేట్టివేసింది. అప్పటికే ఆమె కొంతమేరకు తాగింది. వెంటనే సమాచారం అందుకున్న ఎస్సై లేళ్ల సుధీర్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108లో మౌలాబిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలులో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.