పౌరుషానికి ప్రతీక.. ఒంగోలు జాతి గిత్తలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:08 AM
పౌరుషానికి ప్రతీక ఒంగోలు జాతి గిత్తలని ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ చెప్పారు. మద్దిరాలపాడు గ్రామంలోని పీవీసీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకటరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలను సోమవారం ఎమ్మెల్యేతోపాటు పీడీసీసీబీ చైర్మన్ కామేపల్లి శీతారామయ్య, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్‌పర్సన్ ముప్పవరపు సుచిత్రచౌదరి ప్రారంభించారు.
ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్
ఉత్సాహంగా మద్దిరాలపాడులో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు
నాగులుప్పలపాడు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : పౌరుషానికి ప్రతీక ఒంగోలు జాతి గిత్తలని ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ చెప్పారు. మద్దిరాలపాడు గ్రామంలోని పీవీసీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకటరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలను సోమవారం ఎమ్మెల్యేతోపాటు పీడీసీసీబీ చైర్మన్ కామేపల్లి శీతారామయ్య, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్‌పర్సన్ ముప్పవరపు సుచిత్రచౌదరి ప్రారంభించారు. తొలుత సభా వేదికపై సీఎం చంద్రబాబు జన్మదిన కేక్‌ను కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోటీల జ్యోతిని ఎమ్మెల్యే ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి గిత్తల యజమానులను ప్రోత్సహించేలా మద్దిరాలపాడులో బల ప్రదర్శన పోటీలను నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు నిర్వహించడం అభినందనీయమన్నారు. మద్దిరాలపాడు గ్రామం అంటే ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. కార్యక్రమంలో నిర్వాహకులు, టీడీపీ నాయకులు గుమ్మడి సాయిబాబా, మండవ రవి, అడకా స్వాములు, పొగాకు ఉత్పతిదారుల సమాఖ్య అధ్యక్షుడు మండవ జయంతిబాబు, పోతినేని శ్రీనివాసరావు, ఇంటూరి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, దివి పున్నారావు, మారెళ్ల వెంకట శేషయ్య, బీజేపీ నాయకులు కావూరి వాసు, పెనుబోతు సునీల్‌బాబు, షేక్ ఖాజావలి, ప్రసాద్, వర్దినేని శేషయ్య, నెప్పల శివకృష్ణ, పాలడుగు మురళీ పాల్గొన్నారు.
ఎడ్ల బలప్రదర్శన పోటీలు రెండు పళ్ల విభాగంలో 9 జతల ఎడ్లు పాల్గొన్నాయి. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన బెల్లం మోహనరావు, రవీంద్రబాబు ఎడ్లజత 600 కిలోల విభాగంలో 3,029 అడుగులు లాగి విజేతగా నిలిచాయి. చిలకలూరిపేట మండలం కావూరిలింగంకుంట గ్రామానికి చెందిన మైలా త్రివేణినాయుడు ఎడ్లజత 3000 అడుగులు లాగి రెండవ బహుమతిని, మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన బుచ్చిగారి విజయలక్ష్మినాయుడుకు చెందిన ఎడ్ల జత 2715 అడుగులు లాగి మూడవ బహుమతిని, సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన నక్కా బలరామకృష్ణ జత 2706 అడుగులు లాగి నాల్గవ బహుమతి సాధించాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడుకు చెందిన గొల్లపూడి కోటయ్య, ఆళ్ల మోహనరావు జత 2701 అడుగులు లాగి ఐదవ, కొమరోలు మండలం పామూరుపల్లికి చెందిన గోపు రమణారెడ్డి, కామూరి రమణారెడ్డి, కడప జిల్లా కమలాపురం మండలం అప్పాయపాలెంకు చెందిన బోయల నీకంఠేశ్వరరెడ్డికి చెందిన ఎడ్లు 2700 అడుగులు లాగి ఆరవ, గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కేలం పద్మనాయుడుకు చెందిన జత 2617 అడుగులు లాగి ఏడవ, వినుకొండకు చెందిన జయంతి వైద్యశాల వైద్యులు కాకాని వెంకట సురేంద్ర ఎడ్లు 2488అడుగులు లాగి ఎనిమిదవ, సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన మాదాల శ్రీదేవి, రాజమౌనిక ఎడ్లు 2381 అడుగులు లాగి తొమ్మిదవ బహుతిని సాధించాయి. విజేతలైన ఎడ్ల జతలకు మంగళవారం నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు తెలిపారు.