Share News

యువకుని ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:40 PM

ఈత సరదా యువకుని ప్రాణం తీసింది. శనివారం ముగ్గురు యువకులు సరదగా రామతీర్థం ఆలయం సమీపం నుంచి వెళ్తున్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువలో ఈత కొడదామని దిగారు.

యువకుని ప్రాణం తీసిన ఈత సరదా
మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న పోలీసులు

ఓబీసీ డ్రాప్‌లో చిక్కుకొని ఊపిరాడక మృతి

చీమకుర్తి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి) : ఈత సరదా యువకుని ప్రాణం తీసింది. శనివారం ముగ్గురు యువకులు సరదగా రామతీర్థం ఆలయం సమీపం నుంచి వెళ్తున్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువలో ఈత కొడదామని దిగారు. వారిలో సయ్యద్‌ అబ్దుల్‌ రెహమాన్‌(22) అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకొని వెళ్లి డ్రాపులో చిక్కుకుపోయి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న చీమకుర్తి సీఐ దాసరి ప్రసాదు, ఎస్‌ఐ కృష్ణయ్యలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రాపులో ఇరుక్కుపోయిన రెహమాన్‌ని బయటకు తీసుకువచ్చి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడు పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి. బోర్‌వెల్‌ బండితో బోర్లు వేసే నిమిత్తం ఇక్కడకు రావటం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:40 PM