వివాహిత అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:26 PM
అనుమానానికి ఓ నిండు ప్రాణం బలైంది. అద్దంకి పట్టణంలోని పెరికపాలెంలో ఈర్ల ప్రియాంక(34) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త హత్యచేసి ఉంటారనే అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు
భార్యపై అనుమానం
పదో తరగతి పరీక్షకు వెళ్లిన కుమార్తె
కుమారుడితో సహా పరారైన భర్త
హత్యగా అనుమానం
అద్దంకి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అనుమానానికి ఓ నిండు ప్రాణం బలైంది. అద్దంకి పట్టణంలోని పెరికపాలెంలో ఈర్ల ప్రియాంక(34) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త హత్యచేసి ఉంటారనే అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు. అద్దంకిలోని గుంజివారిపాలేనికి చెందిన బాలకోటేశ్వరరావు, ప్రియాంకలకు 17ఏళ్ల క్రితం వివాహమైంది. వీళ్లకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పదో తరగతి చదువుకుంటూ అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది. 7వ తరగతి చదువుతున్న కుమారుడు బాలకోటేశ్వరరావు, ప్రియాంకలతో కలిసి పెరికపాలెంలో అద్దెకు ఉంటున్నాడు. సోమవారం కుమార్తె పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్లింది. కుమారుడుని బాలకోటేశ్వరరావు పాఠశాల వద్ద వదిలివచ్చాడు. ఇంటి వద్ద ఏమి జరిగిందో ఏమో మరలా బాలకోటేశ్వరరావు పాఠశాల వద్దకు వెళ్లి కుమారుడిని తీసుకొని ఎటో వెళ్లిపోయాడు. అయితే గుంజి దేవసహాయం, ఆదిలక్ష్మి తన కుమార్తె ప్రియాంకకు పలుసార్లు ఫోన్ చేసినప్పటికి స్విచ్ఛా్‌పగా వస్తుండటంతో అనుమానం వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లి చూశారు. మంచం మీద ఉండటంతో నిద్రపోతుందని లేపారు. అనంతరం మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలాన్ని సీఐ సుబ్బరాజు పరిశీలించారు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండటాన్ని బట్టి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రియాంకపై భర్త బాలకోటేశ్వరరావుకు అనుమానం ఉంది. ఈక్రమంలో సోమవారం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. బెడ్ మీద ప్రియాంక పడి ఉండటాన్ని బట్టి ఊపిరి ఆడకుండా చేసి భర్త హత్యచేసి ఉంటాడనే అనుమానాన్ని బంఽధువులు వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాగ్‌స్క్వాడ్ పరిసరాలను పరిశీలించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.