జనగణన నుంచి సర్వేయర్లకు మినహాయింపు
ABN , Publish Date - Apr 26 , 2026 | 02:33 AM
జిల్లాలో జనగణన (ఎన్యుమరేషన్) నుంచి గ్రామ సర్వేయర్లను మినహాయిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ సర్వేయర్లు రీసర్వే కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో కొలతలు, సరిహద్దుల నిర్ణయం, రికార్డుల తయారీలో కీలకంగా పనిచేస్తున్నారు.
కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జనగణన (ఎన్యుమరేషన్) నుంచి గ్రామ సర్వేయర్లను మినహాయిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ సర్వేయర్లు రీసర్వే కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో కొలతలు, సరిహద్దుల నిర్ణయం, రికార్డుల తయారీలో కీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి వారిని జనాభా లెక్కల పనులకు నియమించడం వల్ల రీసర్వేకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈనేపథ్యంలో వారికి మినహాయింపు ఇచ్చారు. గ్రామ సర్వేయర్ల స్థానంలో జిల్లాలోని తహసీల్దార్లు, చార్జ్ సన్సెస్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ ఆదేశించారు.