అన్ని గ్రామాల్లో సరఫరా పునరుద్ధరణ
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:21 AM
జిల్లాలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. మురసు తుఫాన్‌కు దెబ్బతిన్న స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశామన్నారు. జిల్లా అంతటా సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యుత్ శాఖకు రూ.20 కోట్ల నష్టం
ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు వెల్లడి
ఒంగోలు క్రైం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. మురసు తుఫాన్‌కు దెబ్బతిన్న స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశామన్నారు. జిల్లా అంతటా సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 15వేల స్తంభాలు పడిపోయినట్లు చెప్పారు. వారంరోజులుగా రాత్రింబవళ్లు సిబ్బంది శ్రమించి అన్ని గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించారన్నారు. 1,400 మంది సిబ్బంది సమన్వయంతో పనిచేసి మరమ్మతులను పూర్తిచేశారని పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి సహకారం అందించాయన్నారు. నాగులుప్పలపాడు, కొత్తపట్నం మండలాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినగా ప్రస్తుతం సాధారణ స్థితికి తీసుకురాగలిగామని తెలిపారు. పరిశ్రమలు, ఆక్వా, వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వీలైనంత త్వరితగతిన పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.