Share News

సూరీడు సెగలు

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:09 AM

ఎండలు మండిపోతున్నాయి. సూర్యు డు సెగలు కక్కుతున్నాడు. ఉదయం 9 గంటలకే భగభగ మండుతున్నాడు. మధ్యా హ్నానికి మంటపుట్టిస్తున్నాడు.

సూరీడు సెగలు
మంగళవారం మధ్యాహ్నం పెద్దగా జన సంచారం లేని ఒంగోలులోని కోర్టుసెంటర్‌

13 మండలాల్లో 40డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు

బల్లికురవలో అత్యధికంగా 44.1 డిగ్రీలు నమోదు

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఎండలు మండిపోతున్నాయి. సూర్యు డు సెగలు కక్కుతున్నాడు. ఉదయం 9 గంటలకే భగభగ మండుతున్నాడు. మధ్యా హ్నానికి మంటపుట్టిస్తున్నాడు. సాయంత్రానికి కూడా సెగలు తగ్గడం లేదు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 28 మండలాలు ఉండగా మంగళవారం 13 చోట్ల 40డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా బల్లికురవలో 44.1 డిగ్రీల ఎండ కాచింది. సంతనూతలపాడులో 42.4, లింగసముద్రంలో 41.6, చీమకుర్తిలో 41.6 వీవీపాలెంలో 41.5, పొన్నలూరులో 41.2, ఒంగోలు అర్బన్‌లో 41.4, కందుకూరులో 41.2, కొత్తపట్నంలో 41.2, దొనకొండలో 40.3, కొండపిలో 40.9, తాళ్లూరులో 40.4, ముండ్లమూరులో 404 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతోపాటు వేడిగాలులు వీస్తున్నాయి. ఉక్కపోత కూడా అధికం కావడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 02:09 AM