మళ్లీ మంటలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 02:53 AM
జిల్లాలో మళ్లీ ఎండ తీవ్రత అధికమైంది. రెండు రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఒంగోలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోత
ఉదయం నుంచే ఉక్కిరిబిక్కిరైన జనం
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ ఎండ తీవ్రత అధికమైంది. రెండు రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు పలు మండలాల్లో ఎండ మండుతుండటంతో ప్రజానీకం బయటకు రావాలంటేనే భయపడ్డారు. ఒంగోలులో మంగళవారం 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అది బుధవారం 42 డిగ్రీలకు చేరింది. కనిష్ఠ ఉష్ణోగ్రత మంగళ, బుధవారాల్లో 31.0 డిగ్రీలుగా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడుతుండటంతో ఆ ప్రాంతాల్లో ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఉపశమనం పొందగా మన జిల్లాలో మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.