భానుడు భగభగ
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:28 AM
జిల్లాలో భానుడు భగభగ మండిపోయాడు. మొత్తం 28 మండలాలు ఉండగా 14 మండలాల్లో శుక్రవారం 40 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. అత్యధికంగా బల్లికురవలో 42.5 డిగ్రీల ఎండ కాచింది.
14 మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు
బల్లికురవలో 42.5 డిగ్రీలు నమోదు
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భానుడు భగభగ మండిపోయాడు. మొత్తం 28 మండలాలు ఉండగా 14 మండలాల్లో శుక్రవారం 40 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. అత్యధికంగా బల్లికురవలో 42.5 డిగ్రీల ఎండ కాచింది. ఒంగోలు అర్బన్‌లో 41.9, మర్రిపూ డిలో 41.6, వలేటివారిపాలెంలో 41.8, లింగసము ద్రంలో 41.4, పొన్నలూరులో 41.1 డిగ్రీలు నమో దైంది. అది కొండపిలో 40.9, కొత్తపట్నంలో 40.8, దొనకొండలో 40.8, చీమకుర్తిలో 40.6, కందుకూరులో 40.6, తాళ్లూరులో 40.1, కురిచేడులో 40.3 డిగ్రీలుగా ఉంది. ఇతర మండలాల్లో 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. వడగాడ్పులు, ఉక్కపోత కూడా ఉండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.