ఎండ మండే
ABN , Publish Date - May 26 , 2026 | 01:23 AM
జిల్లాలో సోమవారం ఎండ మండింది. రోహిణి కార్తె ప్రారంభం రోజునే భానుడు నిప్పులు కురిపించాడు. జిల్లాలోని మొత్తం 28 మండలాల్లో 24చోట్ల 40డిగ్రీల కుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మూడు మండలాల్లో 45 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు
ఒంగోలు కలెక్టరేట్, మే 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సోమవారం ఎండ మండింది. రోహిణి కార్తె ప్రారంభం రోజునే భానుడు నిప్పులు కురిపించాడు. జిల్లాలోని మొత్తం 28 మండలాల్లో 24చోట్ల 40డిగ్రీల కుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అద్దంకి, బల్లికురవ, ఎస్‌ఎన్‌పాడు మండలాల్లో 45.4డిగ్రీల ఎండ కాచింది. జె.పంగులూరు మండలంలో 44.9, ఒంగోలురూరల్‌లో 44.6, నాగులుప్పలపాడులో 44.5, చీమకుర్తిలో 44.1, కొండపిలో 44.1, మద్దిపాడులో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది కురిచేడు మండలంలో 43.9, ముండ్లమూరులో 43.8, టంగు టూరులో 43.7, తాళ్లూరులో 43.8, కొరిశపాడులో 43.6 డిగ్రీలు, సంతమాగులూరులో 42.7, కందు కూరులో 42.5, కొత్తపట్నంలో 42.5, పొన్నలూరులో 42.5, జరుగుమల్లిలో 41.9, సింగరాయకొండలో 41.3, వలేటివారిపాలెంలో 40.1 డిగ్రీలుగా ఉంది. సోమవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని కొద్దిపాటి జల్లులు పడ్డాయి. తొమ్మిది గంటల నుంచి భానుడి భగభగలు మొదలయ్యాయి. మధ్యాహ్నానికి మరింత మండిపోయాడు. దీంతో గడపదాటి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోయారు.