Share News

‘పది’లో విజయం.. విమానంలో విహారం

ABN , Publish Date - Jun 04 , 2026 | 03:16 AM

మండ లంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు విక్రం తారాబాయి తాను ఏర్పాటు చేసిన తారాశ్రీ ఫౌండేషన్‌ ద్వారా విమానయాన సౌకర్యం కల్పించారు.

‘పది’లో విజయం.. విమానంలో విహారం
గన్నవరంలో విమానం ఎక్కుతున్న విద్యార్థులు

విద్యార్థులకు ఉచిత సౌకర్యం కల్పించిన తారాబాయి

సంతనూతలపాడు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : మండ లంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు విక్రం తారాబాయి తాను ఏర్పాటు చేసిన తారాశ్రీ ఫౌండేషన్‌ ద్వారా విమానయాన సౌకర్యం కల్పించారు. బుధవారం పది మంది విద్యార్థులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయంలో విమానం ఎక్కి లోపల సీట్లో కూర్చొని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. విద్యార్థులతోపాటు ఉన్న ఎంఈవో వెంకారెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఉంటున్న విక్రం తారాబాయి సమాజంలో తనవంతు బాధ్యత నిర్వహించాలన్న తపనతో ఏర్పాటు చేసిన తారాశ్రీ ఫౌండేషన్‌తో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారన్నారు. తన స్వగ్రామమైన ఎనికపాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తారాబాయి అదే పాఠశాలకు ఎన్నో సౌకర్యాలు కల్పించారన్నారు. విద్యార్థులకు హైదరాబాద్‌లో పలు చారిత్రక ప్రదేశాలను చూపించనున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 03:16 AM