Share News

దర్శి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:01 PM

దర్శి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు.

దర్శి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
సీసీరోడ్లు, మురుగు కాల్వలను ప్రారంభిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ

దర్శి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. దర్శి పట్టణంలోని 17, 18 వార్డుల్లో రూ.40 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు, మురుగుకాల్వలను, నిమ్మలబావి చుట్టూ ప్రహరీ తదితర పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్నారు. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వలన ఐదేళ్లు నిలిచిపోయిన అనేక పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేశామన్నారు. దర్శి పట్టణంలో ఇండోర్‌ మినీస్టేడియం, టీటీడీ కల్యాణ మండపం నిర్మాణాలు పూర్తయ్యాయని త్వరలో ప్రారంభిస్తామన్నారు.

ప్రజా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణ

ప్రజా ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. దర్శి పట్టణంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి అభివృద్ధిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్‌కళ్యాణ్‌ల సారథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి సాధించిందన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ లలిత్‌ సాగర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పిచ్యయ్య, కమిషనర్‌ కె.అర్జునరావు, ఏఎంసీ చైర్మన్‌ నాగవేణిసుబ్బారావు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, మండల టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీజెపీ ఇన్‌చార్జి మాడపాకుల శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:01 PM