Share News

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 02:58 AM

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసు కుంటామని డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ హెచ్చ రించారు. స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాల యంలో మంగళవారం ఆయన బెట్టింగ్‌లకు పాల్పడిన దర్శి పట్టణంతోపాటు జిల్లాలో మొత్తం 14 మంది యువకులు, వారి కుటుం బ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
బెట్టింగ్‌లకు పాల్పడిన యువతకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ

దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ

దర్శి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసు కుంటామని డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ హెచ్చ రించారు. స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాల యంలో మంగళవారం ఆయన బెట్టింగ్‌లకు పాల్పడిన దర్శి పట్టణంతోపాటు జిల్లాలో మొత్తం 14 మంది యువకులు, వారి కుటుం బ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. హెచ్చరి కలు జారీ చేశారు. మొదటి సారి అయినం దున తొలితప్పుగా భావించి కౌన్సెలింగ్‌తో సరిపెడుతున్నామన్నారు. భవిష్యత్తులో బెట్టిం గ్‌లకు పాల్పడితే బలమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దర్శి పట్టణంతోపా టు ఉమ్మడి జిల్లాలోని అనేకమంది యువకులు బెట్టింగ్‌ మాయలో ఎలా పడ్డారో వివరించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు బెట్టింగ్‌లో సుమారు రూ.20 లక్షలు కోల్పోయినట్లు చెప్పారు. మరో ఉద్యోగి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. వ్యవసాయం, పలు చిరువ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కూడా బెట్టింగ్‌ల్లో డబ్బులు పోగొట్టుకున్నారని తెలిపారు. ఈ విషయాలని గుర్తించి ఎవ్వరూ ఆవైపు వెళ్లవద్దని డీఎస్పీ హితవు పలికారు.

ముమ్మర దర్యాప్తు

క్రికెట్‌ బెట్టింగ్‌ నిందితులను పట్టుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు బెట్టింగ్‌లో కీలక నిందితులు ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిని విచారించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాల్లో మొత్తం 26 మంది కీలకంగా వ్యవహరిస్తూ బెట్టింగ్‌లు వేయిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 22 మంది అమాయకులైన యువకులు బెట్టింగ్‌లలో డబ్బులు కోల్పోయినట్లు చెప్పారు. కొద్దిరోజుల క్రితం ఎనిమిది మందికి, మంగళవారం 14 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. ఎక్కడైనా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే తమకు తెలపాలన్నారు. కార్యక్రమంలో సీఐ రామారావు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 02:58 AM