జూదం ఆడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:30 AM
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎక్కడైనా కోడి పందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు హెచ్చరించారు. తన కార్యాలయం నుంచి ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుల చేశారు.
కోడి పందేలు, పేకాట నిషేధం
సంక్రాంతిని అందరూ ఆనందంగా చేసుకోవాలి
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
ఒంగోలు క్రైం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎక్కడైనా కోడి పందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు హెచ్చరించారు. తన కార్యాలయం నుంచి ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుల చేశారు. సంప్రదాయ క్రీడలైన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ పోటీలను నిర్వహించుకోవాలని సూచించారు. పండుగను అందరూ కుటుంబ సభ్యులతో కలిపి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. జిల్లా పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోని శివార్లలో కోడి పందేలు, పేకాట, గుండాట తదితతరవి నిషేధమన్నారు. వాటిని ప్రోత్సహించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే అలాంటి అసాంఘిక కార్యకలాలు నిర్వహించే వారిని గుర్తించి బైండోవర్ చేశామన్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుని డ్రోన్‌ల సహాయంతో అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే 91211 02266 నంబర్‌కు వాట్పాప్ ద్వారా, 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.