Share News

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఆగంతకులు

ABN , Publish Date - Feb 01 , 2026 | 10:55 PM

ఏమాత్రం ఆనవాళ్లు కనిపించకుండా దొంగలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఓ పథకం ప్రకారం ముందుగా బైక్‌ను దొంగిలించారు.. ఆ తర్వాత ఆ బైక్‌ మీద వచ్చి ఓ మహిళ మెడలో బంగారం గొలుసు లాక్కెళ్లారు. బైక్‌ను మార్గమధ్యలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది.

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఆగంతకులు

ఒంగోలు నగరంలో తొలుత బైక్‌ చోరీ

పనిపూర్తయ్యాక సౌత్‌ బైపా్‌సలో వదిలేసిన దొంగలు

ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు

ఒంగోలు క్రైం, ఫిబ్రవరి1(ఆంధ్రజ్యోతి) : ఏమాత్రం ఆనవాళ్లు కనిపించకుండా దొంగలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఓ పథకం ప్రకారం ముందుగా బైక్‌ను దొంగిలించారు.. ఆ తర్వాత ఆ బైక్‌ మీద వచ్చి ఓ మహిళ మెడలో బంగారం గొలుసు లాక్కెళ్లారు. బైక్‌ను మార్గమధ్యలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... ఆదివారం తెల్లవారు జామున స్థానిక రాజీవ్‌ కాలనీ 6వలైన్‌లో ఓ బైక్‌ను దొంగిలించారు. అక్కడ నుంచి వెళ్లి సంతపేట ఆంజనేయస్వామి గుడి మూల మీద ఉన్న పాలబూత్‌లో ఉదయం 5.30 గంటలకు శేషమ్మ అక్కడ శుభ్రం చేస్తుండగా ఇరువురు ఆగంతకులు బైక్‌పై వెళ్లి ఆమె మెడలో బంగారం గొలుసు (సుమారు నాలుగు సవర్లు) లాక్కోని బైక్‌ మీద పరారీ అయ్యారు. ఇదే క్రమంలో ఈ బైక్‌ను సౌత్‌ బైపాస్‌ రోడ్డులోని నరాచి హోటల్‌ వద్ద పార్కింగ్‌ చేసి దొంగలు పరారీ అయ్యారు. బైక్‌ నడిపే వ్యక్తి హెల్మెట్‌ ధరించాడు. వెనుక ఉన్న వ్యక్తి మంకీ క్యాప్‌ ధరించి ఉన్నాడు. ఎక్కడ వారి గురించి ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకొని ముందస్తుగాను బైక్‌ చోరీ చేశారు. అదే క్రమంలో వారి ముఖాలు కనిపించకుండా మాస్క్‌లు ధరించారు. దీంతో బాధితురాలు శేషమ్మ ఫిర్యాదు మేరకు ఒంగోలు టూటౌన్‌ సీఐ మేడా శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 10:55 PM